ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ కూలనుందా..?

ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ కూలనుందా..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు మాత్రమే అయింది. అప్పుడే రేవంత్ సర్కార్ కూలిపోబోతోందంటూ బీఆర్ఎస్ చెప్తోంది. రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే కాబోతున్నట్టు ప్రకటిస్తోంది. నిజంగానే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల తర్వాత కూలిపోబోతోందా..? లేకుంటే బీఆర్ఎస్ డిఫెన్స్ గేమ్ ఆడుతోందా..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి అనూహ్యంగా సీఎం అయ్యారు. ముఖ్యమంత్రి పీఠం కోసం చాలా మంది పోటీ పడినా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. రేవంత్ సీఎం అయ్యాక నేతలందరినీ కలుపుకుపోతున్నారు. రేవంత్ పై కాంగ్రెస్ నేతల్లో, కేడర్ లో కూడా నమ్మకం పెరిగింది. రేవంత్ పై పూర్తి నమ్మకంతో పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా పార్టీపై ఈగ వాలినా సహించబోనని చెప్తున్నారు. అందుకు తగ్గట్టే ఎవరైనా ఒకటంటే ఆయన రెండంటున్నారు. అయితే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండడంతో పార్టీల మధ్య మాటల తూటాలు మరోసారి పేలుతున్నాయి.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్సే త్వరలోనే బీజేపీతో కలవడం ఖాయమని.. కవిత కేసు నుంచి బయటపడేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలహీన నేతలను బరిలోకి దింపిందని ఆరోపిస్తోంది.

మరోవైపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. ప్రతిరోజూ సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది తన వైపు ఉన్నారో లెక్కపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. త్వరలో మరికొంతమంది కూడా వెళ్తారనే టాక్ నడుస్తోంది. 26 మంది ఎమ్మెల్యేలను లాక్కొని బీఆర్ఎస్ పక్షం లేకుండా చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఆ ఫ్రస్టేషన్ తోనే బీఆర్ఎస్ లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పైర్ అవుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :