ASBL NSL Infratech

రాహుల్ గాంధీకి బీజేపీ మేలు చేస్తోందా..? కీడు చేస్తోందా..?

రాహుల్ గాంధీకి బీజేపీ మేలు చేస్తోందా..? కీడు చేస్తోందా..?

రాజకీయాలంటేనే ఎత్తులు.. పైఎత్తులు.! ప్రత్యర్థులను అణగదొక్కి తాము ఎదగాలని ప్రతిపార్టీ కోరుకుంటుంది. అధికారంలో ఉన్న పార్టీ విపక్షాలను తొక్కేసి లబ్ది పొందాలనుకోవడం కామనే. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విపక్షాలను తొక్కేసి తాను ఎదుగుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని బీజేపీ గట్టిగానే టార్గెట్ చేసింది. ఆ పార్టీని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కబ్జా చేసేసింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో జాతీయ నాయకత్వంపైన కూడా కన్నేసింది.

మోదీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ కొరకరాని కొయ్యగా మారారు. అదానీ-మోదీ మధ్య సంబంధాలపై రాహుల్ గాంధీ పదేపదే ప్రశ్నిస్తున్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత రాహుల్ గాంధీ స్వరం మరింత పెరిగింది. ఇదే అంశంపై విపక్షాలన్నీ రాహుల్ గాంధీకి మద్దతు పలికాయి. దీంతో మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశంపై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. విపక్షాలు కూడా పట్టు వీడడం లేదు. దీంతో ఉభయసభలు స్తంభిస్తూనే ఉన్నాయి.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ గతంలో చేసిన కామెంట్స్ కేంద్రానికి వరంలా మారాయి. ఆయనకు సూరత్ కోర్టు జైలు శిక్ష విధించడంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. రాహుల్ గాంధీ తప్పు చేశాడని నిరూపించేందుకు కేంద్రంలోని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ బీజేపీ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. రాహుల్ గాంధీ విషయంలో కేంద్రం తప్పు చేసిందనే భావనే ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. బీజేపీ ఎంత ప్రయత్నిస్తున్నా.. రాహుల్ గాంధీ వైపే జనం ఉంటున్నట్టు తేలుస్తోంది.

రాహుల్ గాంధీని ఇరకారటంలో పెట్టామనే సంతృప్తి తప్ప బీజేపీకి పెద్గగా ఒనగూరుతున్న ప్రయోజనం ఏదీ కనిపించడం లేదు. మొన్న అనర్హత వేటు వేయడం, ఇప్పుడు ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశించడం.. లాంటి పరిణామాలు మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై కక్ష సాధిస్తోందనే అంశాన్నే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుంది తప్ప బీజేపీకి కలిసొస్తున్నట్టు కనిపించడంలేదు. మరి దీని నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :