Radha Spaces ASBL

ప్రశాంత్ కిశోర్ సేవలకు కేసీఆర్ గుడ్ బై? ఎక్కడ చెడింది..?

ప్రశాంత్ కిశోర్ సేవలకు కేసీఆర్ గుడ్ బై? ఎక్కడ చెడింది..?

ప్రశాంత్ కిశోర్ తో కేసీఆర్ దోస్తీ చెడిందా..? ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వ్యూహకర్తగా పని చేయట్లేదా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిశోర్ తో కేసీఆర్ భేటీ కాకపోవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. ప్రశాంత్ కిశోర్ తనకు మంచి ఫ్రెండ్ అని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయనతో కలిసి పనిచేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ సేవలను వాడుకుంటున్నామని.. అంతేకాక జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పీకేతో కలిసి పని చేస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే ఇప్పుడు వారి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేకు దేశవ్యాప్తంగా ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సేవల కోసం పలు రాజకీయ పార్టీలు ఎదురు చూస్తుంటాయి. ఆయనతో కలిసి పనిచేస్తే విజయం సాధ్యమని నమ్ముతుంటాయి. ఇప్పటికే పలు పార్టీలు పీకేతో కలిసి వర్క్ చేస్తున్నాయి. ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ తదితురులు పీకే సేవలను వినియోగించుకుంటున్నారు. ఇంతకాలం కేసీఆర్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు పీకే సేవలు కేసీఆర్ కు అందడం లేదనేది తాజా సమాచారం.

అసలు ప్రశాంత్ కిశోర్ కు, కేసీఆర్ కు ఎక్కడ గ్యాప్ వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కోసం పలు సర్వేలు నిర్వహించింది ఐప్యాక్ టీమ్. ఈ సర్వేల్లో మెజారిటీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత వ్యక్తమయినట్లు తెలుస్తోంది. దీనితో ఏకీభవించని కేసీఆర్.. మరోసారి సర్వే చేయాలని ఐప్యాక్ ను కోరారు. రెండోసారి కూడా ఐప్యాక్ టీం మరింత సమగ్రంగా సర్వే చేపట్టి వ్యతిరేకత ఉన్న విషయాన్ని మరోసారి నొక్కి చెప్పింది. దీంతో కేసీఆర్ సంతృప్తి చెందలేదని సమాచారం. రాష్ట్రాన్ని వదిలేసి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అందుకే కేటీఆర్ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టాలనుకుంటున్నారు. దీనిపైన కూడా ఐప్యాక్ టీం సానుకూల నివేదిక ఇవ్వనట్లు తెలుస్తోంది. సీఎంగా కేటీఆర్ పైన ప్రజల్లో సానుకూలత లేదని నివేదించినట్లు సమాచారం.

మరోవైపు ఈ విషయం గ్రహించిన ఎమ్మెల్యేలు చాలామంది.. కేసీఆర్ ను కలిసి ఐప్యాక్ సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ కు తిరుగులేని గుర్తింపు ఉందని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అంత సీన్ లేదని వారి ఫీలింగ్. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది కేసీఆరేనని ఎమ్మెల్యేలంతా చెప్తున్నారు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీపైన, తమ పైన వ్యతిరేకత ఉందంటే వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పీకే సర్వే ఎందుకో నమ్మశక్యంగా లేదని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కుండబద్దలు కొట్టారు. దీంతో ఎమ్మెల్యేల ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గినట్లు సమాచారం.

ఓ వైపు ఐప్యాక్ టీమ్ సర్వే సానుకూలంగా లేకపోవడం, మరోవైపు ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి.. కేసీఆర్ ముందరికాళ్లకు బంధం వేసినట్లు తెలుస్తోంది. అందుకే ఐప్యాక్ సేవలు అవసరం లేదని కేసీఆర్ .. ప్రశాంత్ కిశోర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మునుగోడులో క్షేత్రస్తాయిలో పనిచేస్తున్న ఐప్యాక్ టీమ్ మొత్తం ఏపీకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :