Radha Spaces ASBL

తెరపైకి యువతరం.. అధినేతలు టికెట్లు ఇస్తారా..?

తెరపైకి యువతరం.. అధినేతలు టికెట్లు ఇస్తారా..?

ఆంధ్రప్రదేశ్ లో పలువురు సీనియర్ రాజకీయ నేతలు ఈసారి తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ, టీడీపీలలో ఈ పోటీ తీవ్రంగా ఉంది. రెండు పార్టీల్లో చాలా మంది నేతలు తమ వారసులను తెరపైకి తీసుకొచ్చి వాళ్లు రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో తలపండిన చాలా మంది నేతలు ఇప్పుడు మరో తరాన్ని తెరముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. అయితే పార్టీల అధినేతలు వారసులకు టీకెట్లు ఇస్తారా.. లేదా.. అనేది ఆసక్తి కలిగిస్తోంది.

ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీల్లో హడావుడి మొదలైపోయింది. నియోజకవర్గాల వారీగా పార్టీల అధినేతలు బేరీజు వేసుకుంటున్నారు. బలమైన నేతలను బరిలోకి దింపాలనుకుంటున్నారు. సిట్టింగులున్న చోట అభ్యర్థులను మార్చాలా.. లేకుంటే వాళ్లనే కంటిన్యూ చేయాలా.. అని సర్వేలు చేయిస్తున్నారు. సిట్టింగులందరికీ ఈసారి సీట్లు ఇస్తానని.. తమ వారసులను టికెట్లు ఇవ్వాలని అడగొద్దని గతంలో సీఎం జగన్ తమ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఈ ఒత్తిడి ఎక్కువైపోయింది.

చంద్రగిరి నుంచి రెండు సార్లు గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి తన కుమారుడు మోహిత్ రెడ్డిని బరిలోకి దింపాలనుకుంటున్నారు. మోహిత్ రెడ్డి అభ్యర్థిత్వానికి జగన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మిగిలిన నేతలు కూడా తమ వారసులకోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, పోచంరెడ్డి నరేన్ రెడ్డి, బాలనాగి రెడ్డి, పేర్ని నానితో పాటు పలువురు సీనియర్ నేతలు తమ వారసులను బరిలోకి దింపాలనుకుంటున్నారు.

ఇక టీడీపీలో కూడా వారసులకోసం పోటీ గట్టిగానే ఉంది. అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, దినేశ్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కేశినేని నాని లాంటి ఎంతో మంది నేతలు తమ వారసులను ఈసారి ఎన్నికల బరిలో నిలపాలనుకుంటున్నారు. వారసులకు టికెట్లు ఇస్తే సరి.. లేకుంటా వాళ్లే మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

నియోజకవర్గంలో పరిస్థితులను బేరీజు వేసుకుని సీనియర్లను కంటిన్యూ చేయాలా.. లేకుంటా వారసులను బరిలోకి దింపాలా.. అని పార్టీల అధినేతలు సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :