Radha Spaces ASBL

వైసీపీకి భారీ షాక్ తగలబోతోందా..? ఆనం మాటల వెనుక అర్థమేంటి?

వైసీపీకి భారీ షాక్ తగలబోతోందా..? ఆనం మాటల వెనుక అర్థమేంటి?

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలో 60శాతం మంది నేతలు బయటకు వచ్చేస్తారని ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన జిల్లాల్లో కూడా కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆనం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీలో రచ్చ రాజేస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు ఉన్నంత క్రమశిక్షణ ఇప్పుడు లేదనే చెప్పాలి. గతంలో జగన్ ఏం చెప్పినా దానికి నేతలంతా కాదనకుండా సై అనేవాళ్లు. జగన్ మాటను జవదాటే వాళ్లు కాదు. అధిష్టానం కూడా తమ మాట కాదని ఎవరూ వెళ్లరనే అతి నమ్మకంతో ఉండేది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి తత్వం బోధపడింది. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు గీత దాటారు. ఇది వైసీపీ హైకమాండ్ అస్సలు ఊహించలేదు. అప్పటివరకూ 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న జగన్.. ఆ తర్వాత పార్టీ నేతలను కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలు సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. వైసీపీలో టికెట్ వస్తుందో రాదో అంచనా వేసుకుంటున్నారు. జిల్లాలో తమకు దక్కుతున్న ప్రయారిటీని బేరీజు వేసుకుంటున్నారు. బాలినేని లాంటి నేతలు కూడా తమకు ప్రయారిటీ ఇవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి నేతలు అన్ని జిల్లాల్లో ఉన్నారు. కొందరు బయట పడుతున్నారు. కొందరు బయట పడట్లేదంతే. అయితే ఎన్నికల నాటికి ఇలాంటి నేతలంతా బయటికొచ్చేస్తారనే టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. అదే జరిగితే పార్టీకి ఇబ్బందులు తప్పవు.

ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా మంది నేతలు తమ పనులకోసం అక్కడ ఉన్నారని, త్వరలోనే 60 శాతం మంది నేతలు వైసీపీని వదిలేసి వచ్చేస్తారని చెప్పారు. ఆనం నిజమే చెప్పారని కొంతమంది నేతలు అంటుంటే.. అక్కసుతోనే ఆనం అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఇలాంటి కామెంట్స్ చాలా కామన్. నచ్చనప్పుడు ఏమైనా మాట్లాడతారు. నచ్చితే మరోలా మాట్లాడతారు. కానీ అందులో వాస్తవం ఉంటే అధిష్టానం జాగ్రత్త పడితే బెటర్. లేకుంటే లేనిపోని సమస్యలు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :