వీటిపై భారత్ కు ఎలాంటి ఆంక్షలు లేవు : అమెరికా
భారత్‌కు అత్యాధునిక సామర్థ్యాలున్న ఎంక్యూ9-బీ డ్రోన్ల అందజేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. వీటిపై భారత్‌కు ఎలాంటి ఆంక్షల్లేని యాజమాన్య హక్కులు ఉంటాయని పేర్కొంది. మేం భారత్‌కు విక్రయించే డ్రోన్లలో అత్యాధునిక సముద్ర రక్షణ, నిఘా సామర్థ్యాలు ఉంటాయి. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ ఆయుధాలు విక్రయాలు ఉపయోగపడతాయి అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడిరచారు. భారత్-అమెరికా మధ్య ఇండో పసిఫిక్ బంధం మరింత బలపడనుందని ఈ వ్యాఖ్యలు చెబుతున్నట్లు విశ్లేషకులు భావిస్తునారు.
Tags :