ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వాలంటీర్ల వ్యథ..?

వాలంటీర్ల వ్యథ..?

వాలంటీర్లకు వందనమంటూ ఏపీసీఎం జగన్.. వారిని అవార్డులతో సత్కరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వపథకాలకు బ్రాండ్ అంబాసిడర్లకు అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. లీడర్లను చేస్తామని భరోసా సైతం ఇస్తున్నారు. అంతేనా వైసీపీ మంత్రుల్లో కొందరు.. వారు వాలంటీర్లు కాదు.. జగనన్న వారియర్స్అంటూ డైలాగ్స్ దంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు వీరు చుక్కాని కావాలని ఆశిస్తున్నారు. అయితే.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో వాలంటీర్లు వాలంటీర్లే, పార్టీ కార్యకర్తలు .. కార్యకర్తలే అన్న విషయాన్ని హైకమాండ్ గుర్తించాలని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

మరో వైపు.. వాలంటీర్ల పెత్తనం పెరిగిపోయిందని.. తమకు విలువ లేకుండా పోయిందని చాలా నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలు మండిపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి వారే సంక్షేమపథకాలు అందిస్తే.. ఇక తమనెవరు పట్టించుకుంటారన్నది చాలారోజులుగా నేతల ఆవేదన. రేపు ఎన్నికల సందర్భంగా కూడా వారే ప్రచారం నిర్వహించి గెలిపిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది వాలంటీర్లకు కనీసం పది ఓట్లు కూడా లేవని.. వారిని నమ్ముకుని కార్యకర్తలు, నేతలను విస్మరించడమేంటన్నది సూటి ప్రశ్న.

ఇక వాలంటీర్లది మరో బాధ.. జీతం గోరంత..పని మాత్రం కొండంత.. ఎక్కడికి వెళ్లారో రిపోర్టు చేయమంటూ చాలా జిల్లాల్లో ఉన్నతాధికారుల ప్రశ్నలకు బదులివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.తేడా వస్తే వారిపై అధికారుల ఆగ్రహం చూపిస్తున్నారు. దీంతో ఈమాత్రం జీతానికే ఇన్నిపాట్లు పడాలా అన్నది చాలామందిలో కనిపిస్తోంది. అయితే  ఇంటిదగ్గరే ఉంటూ.. పనిచేసుకోవచ్చు, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి .. ఏమైనా లబ్ధి చేకూరుతుందేమో అన్న ఆశ వారిలో ఉంది.

ఇక మరోవైపు వాలంటీర్ల నియామకంపై కొన్ని నెలల  క్రితం హైకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల సమాచారాన్ని వారికి ఎలా అప్పజెబుతారని ప్రశ్నించింది. వారికి ఏ విధమైన పరీక్షలు నిర్వహించి, ఎలా చేర్చుకున్నారని నిలదీసింది. మరోవైపు.. ఈసీ కూడా ఎన్నికల వేళ వారిని దూరంగా ఉంచాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అంటే ఏతావాతా అర్థమవుతుంది ఏంటంటే.. వారికి ఎందులో ఎలాంటి ప్రాధాన్యముండదు.. దీంతో వీరు చెబితే ఎంతమంది ఓట్లేస్తారు.. అసలు వీరి మాటకు ప్రజల దగ్గర విలువ ఉంటుందా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :