ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ప్రధాని మోదీని సీఎం జగన్ కలిశారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని మోదీ దృష్టికి ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లారు.
Tags :