వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయి : పురందేశ్వరి

ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసి కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోంది. వైసీపీ ప్రభుత్వం సొంతంగా చేస్తున్న పని ఒక్కటీ లేదు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం విపక్షాల హక్కు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఇవ్వడం లేదు. రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోకులు వస్తున్నాయి. రైతులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని అన్నారు.






