ASBL Koncept Ambience
facebook whatsapp X

22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిని ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. తర్వాత రోజుల్లో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి, పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఖరారు చేసేందుకు సమయం సరిపోని కారణంగా ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లేదు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :