ట్రోల్ చేసిన వాళ్లే మెచ్చుకుంటున్నారు
మొన్నటివరకు కేవలం పక్కింటమ్మాయి పాత్రలే చేసిన అనుపమ, ఒక్కసారిగా టిల్లూ స్వ్కేర్ సినిమా కోసం గ్లామర్ గేట్లు ఎత్తేయడంతో ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఎందుకు చేసిందనే ప్రశ్నలు అనుపమను విసుగెత్తించాయి. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ పెట్టి మరీ అనుపమను ట్రోల్ చేశారు. ఇవి శృతి మించడంతో మనస్తాపం చెందిన అనుపమ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టేసింది.
అయితే ఇప్పుడు అలాంటి లిల్లీ క్యారెక్టర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. మూవీ స్టార్టింగ్ లో రొమాన్స్ డోస్ ఎక్కువైనప్పటికీ ఆ తర్వాత లిల్లీ పాత్రకు పెట్టిన ట్విస్టులు, షేడ్స్ ఆడియన్స్ ను షాక్ కు గురి చేశాయి. అనుపమ బోల్డ్ గా నటించినా, లిప్ లాక్స్ పెట్టినా అవేవీ ఎబ్బెట్టుగా లేకుండా చూసుకోవడంలో డైరెక్టర్ మల్లిక్ రామ్, హీరో సిద్దు సక్సెస్ అయ్యారు.
స్టోరీ ముందుకెళ్లే కొద్దీ గ్లామర్ ఫ్యాక్టర్ ను తగ్గించేసి పూర్తిగా స్టోరీ మీద ఫోకస్ పెట్టడంతో అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిల్లీ క్యారెక్టరే అనుపమకు ఆక్సిజన్ లా మారింది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న అనుపమకు ఈ సినిమా తర్వాత ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తోంది.