మహేష్-రాజమౌళి సినిమాలో మరో స్టార్?
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడొప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అడ్వెంచర్ ఫారెస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమాతో రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తో రాని అవార్డులన్నింటినీ సాధించాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో వార్త నెట్టింట ప్రచారం అవుతుంది. మహేష్ హీరోగా చేయనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మరో హీరో కూడా నటించనున్నాడని వార్తలొస్తున్నాయి. మరి ఆ కీ రోల్ కోసం జక్కన్న ఈసారి బాలీవుడ్ హీరోను దింపుతాడా లేక ఏకంగా హాలీవుడ్ హీరోను దింపుతాడా అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు రీసెంట్ గా యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి, రణ్‌బీర్ ను ఉద్దేశించి ఆయన బాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో అని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే మహేష్-రాజమౌళి మూవీలో రణ్‌బీర్ ను తీసుకుంటారా అన్న దిశగా కూడా ఫ్యాన్స్ ఆలోచించి, అదే నిజమైతే అంతకంటే కావాల్సిందేముందని ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.