అమెరికాలో మరో భారత సంతతి విద్యార్థి మృతి
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న సమీర్ కామత్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్థానిక నేచర్ రిజర్వ్ వద్ద అతడు విగతజీవిగా కన్పించినట్లు అధికారులు వెల్లడిరచారు. 23 ఏళ్ల సమీర్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. గతేడాది ఆగస్టులో మాస్టర్స్ పూర్తి చేసిన అతడు పీహెచ్‌డీలో చేరాడు. అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఫోరెన్సిక్ పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. భారత మూలాలున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఈ ఏడాదిలో ఇది ఐదో ఘటన కావడం గమనార్హం.
Tags :