ASBL Koncept Ambience
facebook whatsapp X

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరో పురస్కారం

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరో పురస్కారం

జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ( జీహెచ్‌ఐఏఎల్‌)కు మరో పురస్కారం లభించింది. ఈ ఏడాది గాను భారత్‌తో పాట దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది అవార్డును దక్కించుకుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఈ నెల 17న నిర్వహించిన ప్యాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌పో 2024లో గ్లోబల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ రేటింగ్‌ సంస్థ స్కైట్రాక్స్‌ ఈ అవార్డును ప్రకటించింది. విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆయా సేవలందించే సిబ్బంది వైఖరి, స్నేహపూర్వకత, సమర్థత వంటి అంశాల పరిశీలన ఆధారంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :