ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : 'అన్నీమంచి శకునములే' కానీ ఎవరికీ లాభం లేదు!

రివ్యూ : 'అన్నీమంచి శకునములే' కానీ ఎవరికీ లాభం లేదు!

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
తారాగణం: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి,
వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్, ఊర్వశి హోమియోపతీ తదితరులు నటించారు
కెమెరా: సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: జునైద్ సిద్దికీ, సంగీతం: మిక్కీ జె మేయర్, మాటలు : లక్ష్మీ భూపాల
స్క్రీన్ ప్లే : దావూద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
నిర్మాత: ప్రియాంకా దత్, దర్శకత్వం: బి.వి. నందిని రెడ్డి
విడుదల తేదీ: 18.05.2023

మనకున్న కొద్దిమంది మహిళా దర్శకురాలలో నందిని రెడ్డికి  అలా మొదలయింది, జబర్డస్త్, కల్యాణ వైభోగమే!, ఓ బేబీ, పిట్ట కథలు వంటి సున్నితమైన హాస్యం, మానవీయ విలువలతో కుటుంబమంతా చూడదగ్గ చిత్రాలు అందించిన రికార్డు వుంది. ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే' చిత్రంతో ఈ రోజు ముందుకొచ్చారు.  దానికి తోడు మొన్నటి "మహానటి" నుంచి నిన్నటి "జాతిరత్నాలు" వరకు హిట్ సినిమాల మహిళా నిర్మాతలుగా పేరు పడ్డ దత్తుగారి అమ్మాయిలు నిర్మించిన సినిమా ఇది. యువత గుర్తించిన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరుచుకున్న నటుడు సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ తో ఫీల్ గుడ్ మూవీగా గుర్తింపు పొందింది.  మరి సినిమాలో ఆ గుడ్ ఫీల్ ఎంతవరకు ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:

రెండు కుటుంబాల మధ్య ఓ కాఫీ ఎస్టేట్ గురించి కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. ఇందులో ఓ కుటుంబ వారసుడు ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) రెండో కుటుంబానికి చెందిన వారసులు దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ (సీనియర్ నరేష్).  'అల వైకుంఠపురములో' సినెమాలోలా ఈ రెండు కుటుంబాల్లోనూ ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు పిల్లలు తారుమారవుతారు. ఒకళ్లు పెరగాల్సిన చోట మరొకరు పెరుగుతారు. అయితే  రిషి (సంతోష్ శోభన్) సుధాకర్ కొడుకు, ఆర్య (మాళవికా నాయర్) ప్రసాద్ కుమార్తె.   ఐతే ఓ నాటకీయ సంఘటన కారణంగా ఆస్పత్రిలో నర్సుల మధ్య జరిగిన మిస్ అండర్ స్టాండింగ్ వల్ల ఇద్దరు పిల్లలు మారిపోతారు. వాళ్లిద్దరూ పెద్దయ్యి హీరో హీరోయిన్లవుతారు. ఇంతకీ హీరో  బేవర్స్ రకం. దేని మీద శ్రద్ధ, భయభక్తులు ఉండవు; హీరోయిన్ మాత్రం చాలా కాలిక్యులేటెడ్, బిజినెస్ మైండెడ్.  ప్రసాద్ ఇంట్లో ఆయన కొడుకుగా రిషి… సుధాకర్ ఇంట్లో ఆయన కుమార్తెగా ఆర్య పెరుగుతారు. చిన్నతనం నుంచే వీరి మంచి స్నేహితులు. రిషి, ఆర్యని ఇష్ట పడతాడు. అయితే, ఆర్య కమర్షియల్ మైండ్ సెట్ లో ఉంటుంది. మరి చివరకు వీరిద్దరూ ఎలా కలిశారు?, అదేవిధంగా కాఫీ ఎస్టేట్ కేసు కోర్టులో ఏమైంది ? చివరికి అన్ని సినిమాల్లో ఏమౌతుందో అలాంటిదే అయ్యిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

నటీనటవర్గానికి వస్తే సంతోష్ శోభన్ పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. రిషి పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. సరైన ఎంటెర్టైనర్ పడితే మరింతమందికి ప్రేక్షకులకి చేరువవుతాడు. మాళవిక నాయర్ ఓకే. తన లుక్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. ఆమె స్థానంలో మరే ఇతర నటి చేసిన ఇవే మార్కులు పడతాయి.   నరేష్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ అందరూ ఒక టెంపోలో చేసుకుంటూ పోయారు. చాలా కాలం తర్వాత షావుకార్ జానకి బామ్మ పాత్రలో నాలుగైదు సీన్స్ లో కనిపించారు. ఊర్వశి హోమియోపతీ మొదట్లోనూ, క్లైమాక్స్ లో ఒకసారి కనిపించింది. గౌతమి సగటు అమాయిక ఇల్లాలిగా కనిపించింది. వెన్నెల కిషోర్ కామెడీ నవ్వించీ నవ్వించనట్టుగా ఉంటుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

మిక్కీ జె మేయర్ సంగీతం ఎప్పుడో వినేసిన బాణీల్లాగ ఉన్నాయి. పాటల్లోని సాహిత్యం కొంతవరకు ఓకే అనుకోవాలి. తీసినదంతా ఊటీలాంటి ప్రాంతంలోనూ, ఇటలీలోనూ కనుక కెమెరా వర్క్ రిచ్ గా అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాలో ల్యాగ్ ఉన్నప్పుడు ఎడిటింగ్ ని ఏం తప్పుబడతాం.  సంభాషణలు కూడా పెద్దగా పేలనట్టే లెక్క. ఇంతమంది ఆర్టిష్టుల్ని పెట్టుకున్నప్పుడు ఆద్యంతం చక్కని సంభాషణలు ఉండాలి అవి లేనేలేవు. ఇక దర్శకురాలు నందిని రెడ్డి ఈ సారి ఆకట్టుకునే విధంగా సినిమాను రూపొందించలేకపోయారు. ఇక సినిమాలోని ప్రియాంక దత్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ:

ఫస్ట్ హాఫ్  టైటిల్స్ సమయంలో శాంతి స్వరూప్ గొంతుతో  వార్తలు, తర్వాత పాత్రధారుల పరిచయమప్పుడు ఊర్వశి హోమియోపతీ డైలాగ్ మినహాయిస్తే నవ్వు తెప్పించే డైలాగ్ కానీ సన్నివేశం కానీ ఒక్కటి లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా రొటీన్ గా వుంది. ఎందుకంటే ఇంటర్వల్ టైం కి ఎందుకూ పనిరాడన్న వాడు సెకండాఫులో ఎలా మారతాడో, ఏదో ఒక సంఘటనలో గెలుచుకోవాల్సిన వారి మనసుని ఎలా గెలుచుకుంటాడో? మన  ప్రేక్షకులు ఊహించడం కష్టం కాదు.  సెకండ్ హాఫ్  బోరు కొడుతూ కథ నత్త నడక లా సాగుతూ ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణా పెళ్లి...వగైరాలన్నీ అసలు కథకి సంబంధం లేకుండా పిట్టకథల్లాగ వస్తాయి. క్లైమాక్స్ లో రివీలింగ్ పాయింట్ సటిల్ గానే ఉన్నా కథనంలో సమస్యవల్ల నీరసంగా అనిపిస్తుంది. ఓవరాల్ గా లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి అంతే!.  

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :