ASBL NSL Infratech

ఇది తెలంగాణా ప్రజలకు దక్కిన గౌరవం : అనిల్ కూర్మాచలం

ఇది తెలంగాణా ప్రజలకు దక్కిన గౌరవం : అనిల్ కూర్మాచలం

మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న దక్కడం చాలా సంతోషంగా ఉందని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి,  బహుభాషా కోవిదుడు, ఆర్తిక సంస్కరణల సృష్టికర్త అన్నింటికి మించి తెలంగాణ బిడ్డ, ఇది తెలంగాణా ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో నాడు పీవీకి భారత రత్న ఇవ్వాలని మొదటిసారిగా డిమాండ్‌ చేయడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఘనత ఉద్యమనేత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. తమ డిమాండ్‌ గౌరవించి భారత రత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

స్వరాష్ట్రంలో కేసీఆర్‌ నాయకత్వంలో వివిధ కార్యక్రమాల ద్వారా పీవీకి ఘనమైన నివాళిని అర్పించించి బీఆర్‌ఎస్‌ పార్టీనేని, ఆయన శతజయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడమే కాకుండా హైదరాబాద్‌లో వారి విగ్రహ ఏర్పాటు ఘనత కూడా గత ప్రభుత్వాదేనని అన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ మట్టి మనుషులని గౌరవించిన గొప్పతనం కేసీఆర్‌దని, ఆయన కృషితో పీవీకి భారత రత్న రావడం అభినందీయమని వెల్లడిరచారు.  కాంగ్రెస్‌ పార్టీ పీవీకి చేసిన అవమౌనం ఇప్పటికే దేశం మర్చిపోలేదని  ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఎప్పటికీ ఆపార్టీని నేతలను క్షమించరని, నేటి భారత రత్న పురస్కారం వారి నీచ రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :