ASBL NSL Infratech

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మార్గదర్శకులు.. మందు బాబు లేనా..

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మార్గదర్శకులు.. మందు బాబు లేనా..

రాష్ట్ర ఎన్నికల పనితీరు ..గెలుపు ఓటముల ఆటలో మందుబాబులు అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారుతున్నారు. ఒకపక్క రాష్ట్ర రెవెన్యూ ని పెంచడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుపై కూడా వారి ప్రభావం బాగానే ఉంది అన్న విషయం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఈ వర్గం పై కూడా తమ పట్టు సాధించే విధంగా పార్టీలు తమ ప్రణాళికలను రూపొందించే అవకాశం కనిపిస్తోంది. గత ఐదేళ్ల కాలం లెక్కల్లోకి తీసుకుంటే రూలింగ్ పార్టీ నుంచి ప్రతిపక్షం వరకు మూకుమ్మడిగా సానుభూతి చూపించే ఏకైక సెక్షన్ మందుబాబులది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

మందు వద్దు.. ఆరోగ్యం వద్దు అని ఎవరు అనడం లేదు. మధ్యపాన నిషేధం ఊసే లేదు.. వినూత్నంగా ప్రతిపక్షాలు.. చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు అని రూలింగ్ పార్టీ పై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంటే పరోక్షంగా మందుబాబుల వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి రెచ్చగొడుతున్నట్లే కదా. ప్రధాన ప్రతిపక్షం నాయకుడు అయితే ఒక అడుగు ముందుకు వేసి.. మందుబాబులపై తనకు ఉన్న అత్యంత ప్రేమకు నిర్వచనంగా. తాము రూలింగ్ లోకి వస్తే నాణ్యమైన మందు సరఫరా చేస్తాము అని హామీ కూడా ఇచ్చారు.

ఏపీలో అతిపెద్ద సెక్షన్ గా మారిన మందుబాబుల విషయంలో వీలైనంత పాజిటివ్గా మాట్లాడి ఓట్లు దండుకునే ప్రయత్నంలో రూలింగ్ పార్టీ నుంచి ప్రతిపక్షాలు ఉన్నాయి. నిజానికి ఎన్నికల్లో మహిళల ఓట్లు ఎంతో కీలకమైనవి. చాలా సందర్భాలలో మహిళలను నమ్ముకొని ఎన్నో పార్టీలు విజయ డంకా మోగించాయి. ఉదాహరణకు మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా హస్తం రూలింగ్ లోకి రావడానికి మహిళా ఓటర్ల హస్తం ఎంతో ఉంది.

ఫ్రీగా బస్సు ప్రయాణం దగ్గర నుంచి మహిళలకు సానుకూలంగా ఉండే ఎన్నో అంశాలను తమ ప్రతిపాదనలో జోడించి ఎన్నికల్లోకి దిగిన హస్తం పార్టీ వెంట ఉండి గెలిపించారు మహిళా ఓటర్లు. నిన్న మొన్నటి వరకు మన రాష్ట్రంలో కూడా పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండింది కానీ ఇప్పుడు మాత్రం లెక్కలు కాస్త మారినట్లుగా కనిపిస్తోంది. మందుబాబులు ఏ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అన్న వాదన అక్కడక్కడ వినిపిస్తోంది. అయితే ఇటువంటి పరిణామాలు భావితరాల భవిష్యత్తుపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి నాకు ప్రభుత్వాలు.. పార్టీలు కేవలం గెలుపు కోసమే కాకుండా ప్రజల కోసం ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలు పెడతారో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :