హైదరాబాద్‌లో హనీహనీ కిడ్స్ స్టోర్ తొలి ఫ్రాంచైజీ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌లో హనీహనీ తన తొలి స్టోర్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని అశోక్ వన్ మాల్‌లో దంపతులు ఆనం మీర్జా(సానియా మీర్జా సోదరి), మహమ్మద్ అసదుద్దీన్(క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు) తన కూతురు తో కలసి ఈ కిడ్స్ స్టోర్‌ను ప్రారంభించారు.
మహమ్మద్ అసదుద్దీన్ మాట్లాడుతూ ఒక తండ్రిగా, నా బిడ్డకు ఉత్తమమైన వాటిని అందించడానికి ఎంతగానో ఇష్టపడుతానన్నారు. హనీహనీలాంటి సంస్థ నగరానికి రావడం పట్ల తనలాంటి తండ్రులందరికి ఎంతో ఉపయోగమన్నారు. మన పిల్లలకు కావాల్సిన అన్ని ఉత్పత్తులను ఇక్కడ కొనుగోలు చేసుకోనే వన్‌స్టాప్ కేంద్రంగా ఇది నిలుస్తుందన్నారు. బేబీ క్రిబ్ కాట్, స్ట్రోలర్, ప్రామ్, రాకర్, బంక్ బెడ్స్, బేబీ అల్మిరా, బేబీ స్టడీ టేబుల్ మరియు మరెన్నో సహా వారి హాట్-సెల్లింగ్ ఐటెమ్‌లు ఎందరో ప్రముక తల్లిదండ్రుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. ఆనమ్ మీర్జా మాట్లాడుతూ.. మన ఆలోచనలకు, అభిలాషకు అనుగుణమైన ఉత్పత్తులను ఇక్కడ దక్కించుకోవచ్చన్నారు. గర్భిణీలుగా ఉన్న వారు, ప్రసవించిన వారు, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ స్టోర్లో తమకు అవసరమైన అన్ని ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చన్నారు. హనీహనీ సంస్థ బిసినెస్ హెడ్ శ్రీకాంత్ కొమర్ల స్టోర్ నిర్వహకులు మల్లికార్జున్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా పరిమిత కాలంలో 70 శాతం రాయితీతో ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అద్భుతమైన తగ్గింపును పొందేందుకు తల్లిదండ్రులు మరియు కాబోయే తల్లిదండ్రులు స్టోర్‌ని సందర్శించవలసిందిగా కోరారు. హనీహనీ స్టోర్‌లు త్వరలో నగరంలో మరిన్ని అందుబాటులోకి వస్తాయన్నారు.