ఈ ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్ ను నిర్ణయిస్తాయి : అమిత్ షా

తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జనగామలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుంచి హైదరాబాద్ రాష్ట్రం విముక్తి పొందింది. ఒవైసీకి భయపడి సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాలు జరపడం లేదు. బీజేపీ ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారక స్థూపం నిర్మిస్తాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలు. బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ. మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మోదీ కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశారు అని అమిత్ షా తెలిపారు.







Tags :