ASBL NSL Infratech

ఇండియా డే పెరేడ్‌లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) నాయకులు

ఇండియా డే పెరేడ్‌లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) నాయకులు

‘‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పెరేడ్‌లో అమెరికా తెలుగు ఆసోసియేషన్‌ (ఆటా) నాయకులు పాల్గొని తమ దేశభక్తిని చాటారు. ఈ ఇండియా డే పరేడ్ లో యావత్‌ భారత్‌ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్‌ మార్షల్‌ హోదాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహ తో కలిసి హాజరయ్యారు. అటా న్యూ జెర్సీ ప్రాంతీయ సమన్వయకర్త సంతోష్‌ రెడ్డి  కోరం మరియు విలాస్‌ రెడ్డి జంబుల ఆధ్వర్యములో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఆటా ప్రెసిడెంట్‌  భువనేశ్‌ రెడ్డి బుజాల ముందు ఉండి నడిపారు.

ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ, భారత దేశ వాసులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అమెరికా తెలుగు ఆసోసియేషన్‌ (ఆటా) తరపున తెలిపారు. ఆటా తరుపున పెద్ద రథ వాహనాన్ని ( ఫ్లోట్‌) పెట్టి , ఆటా చేస్తున్న తెలుగు కమ్యూనిటీ, ఇతర సేవా కార్యక్రమాలను వాహనంపై చూపిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించి, సాంస్కృతిక కార్యక్రమాల్లో  చిన్న పిల్లలు ఇషాని రెడ్డి, రిషిత జంబుల,  అయాన్‌ రెడ్డి తుమ్మల, మాన్వి మైకా, ఇతర పిల్లలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు పోతు రాజు మరియు డప్పు కళాకారులను సంతోష్‌ రెడ్డి కోరం ఏర్పాటు చేయగా అందరూ అభినందించారు. అలాగే, ఆటా ప్రెసిడెంట్‌  భువనేశ్‌ రెడ్డి బుజాల, శరత్‌ వేముల, ఆటా మాజీ ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీంరెడ్డి, రఘువీర్‌ రెడ్డి, పరశురామ్‌  పిన్నపురెడ్డి, సుధాకర్‌ పెర్కారి, విజయ్‌ కుందూరు, శ్రీనివాస్‌ దార్గులా, మహేందర్‌ ముసుకు, వినోద్‌ కోడూరు, రాజ్‌ చిలుముల, సంతోష్‌ రెడ్డి, ప్రదీప్‌ కట్ట, విలాస్‌ జంబుల కార్యక్రమం జయప్రదం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఆటా సభ్యులు శరత్‌ వేముల మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆటా తరుపున పాల్గొనడం సంతోషముగా ఉంది అని తెలిపారు.

ఆటా మాజీ ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీంరెడ్డి, పరశురామ్‌ పిన్నపురెడ్డి మాట్లాడుతూ న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌, ఫిలడెల్ఫియా, డెలావేర్‌, మన్‌హట్టన్‌లల్లో నివసించే భారతీయులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దాదాపు ఈ పరేడ్‌ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పై తమ్ముకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత స్థాయిలో న్యూయర్క్‌ డే పరేడ్‌ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్‌ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.శ్రీనివాస్‌ దార్గులా, విజయ్‌ కుందూరు,రాజ్‌  చిలుముల మాట్లాడుతూ ఈ పెరేడ్‌ గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డు ఎక్కడం అన్నది భారత ప్రజలకు చాలా సంతోషం అన్నారు.

సంతోష్‌ రెడ్డి కోరం మాట్లాడుతూ ఈ పెరేడ్‌ లో  అమెరికా ప్రజలు కూడా ఆనందము గా పాల్గొని ఇండియా పెరేడ్‌ ని విజయవంతం చేసారు . ఈ పెరేడ్‌ లో బాగం గా వందలాది కమ్యూనిటీ సంస్థలు పాల్గొని పలు సంస్కృతికా కార్యక్రమాలు, వివిధ శకటాల ప్రదర్శన జరిగింది అని తెలిపారు.

ఈ సందర్భముగా ‘‘భారత్‌ మాతాకీ జై, ‘‘వందే మాతరం’’, ‘‘జై హింద్‌, జై జవాన్‌ -జై కిసాన్‌‘‘ అంటూ  నినాదాలతో (స్లొగన్స్‌) రామ్‌ వేముల, లక్ష్మణ్‌ రెడ్డి  అనుగు, శ్రీకాంత్‌ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ వంగపటి, శ్రీధర్‌ నాగిరెడ్డి, వేణు నక్షత్రం, నందిని దర్గుల, అనురాధ చీములా, వాణి అనుగు, మహేందర్‌ ముసుకు, వినోద్‌ కోడూరు, రఘు రెడ్డి, సుధాకర్‌ పెర్కారి, ప్రదీప్‌ కట్ట, విలాస్‌ రెడ్డి జంబుల న్యూయార్క్‌ విధుల్లో ప్రజలను ఆకట్టుకున్నారు. పెరేడ్‌ ను వీక్షిండానికి వచ్చిన ప్రవాస భారతీయులు మరియు న్యూయార్క్‌ ప్రజలు పెరెడ్‌లో పాల్గొన్నవారిని ప్రోత్సహిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భాన్ని ఫోటోల్లో భద్రపరచిన సంతోష్‌ రెడ్డి కోరం, డిస్క్‌ జాకీ గా వ్యవహరించిన దివ్య కు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ అటా నిర్వాహక సంఘం తరుపున సంతోష్‌ రెడ్డి కోరం కృతజ్ఞతలు తెలిపారు.

Click here for Event Gallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :