హైదరాబాద్ లో హెచ్‌సీఏ హెల్త్ కేర్ కార్యకలాపాలు
అమెరికాకు చెందిన హెల్త్ కేర్ సేవల సంస్థ హెచ్‌సీఏ హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో హెచ్‌సీఏ సేవలందిస్తుందని తెలిపారు. భారత్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)లను ఏర్పాటు చేయాలనుకుంటున్న బహుళజాతి కంపెనీలు హైదరాబాద్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని, రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులతో పాటు మెరుగైన మౌలిక వసతులు ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు.
Tags :