ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణ జర్నలిస్ట్‌కు అమెరికా ఆహ్వానం 

తెలంగాణ జర్నలిస్ట్‌కు అమెరికా ఆహ్వానం 

అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు  క్లైమెట్‌ క్రైసెస్‌ ఫర్‌ వెదర్ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్‌గా  తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక సీనియర్‌ జర్నలిస్ట్‌ వాకిటి వెంకటేశం ముదిరాజ్‌. 

ఈ ప్రాజెక్టు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, ఓక్లహామ్‌, కొలరాడో, ఫ్లోరిడా ప్రాంతాల్లో పర్యటించి, వాతావరణంపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 

ఈ అధ్యయన నివేదికను అమెరికా ప్రభుత్వానికి అప్పగించి, సుమారు నెల రోజుల తర్వాత తిరిగి ఇండియాకు చేరుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే గూగుల్‌ న్యూస్‌ ఇన్సియేటివ్‌ ప్రాజెక్టులో భాగస్వామి అయిన వాకిటి, 25 ఏళ్లుగా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా రంగాల్లో వివిధ స్థాయిల్లో చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మారుమూల గ్రామం మాసాయిపేట లోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 

1999లో ప్రజాశక్తి తెలుగు దినపత్రిక నుంచి పత్రిక రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

అంచెలంచెలుగా ఎదుగుతూ సబ్‌ ఎడిటర్‌, చీఫ్‌ సబ్‌ ఎడిటర్ గా వివిధ స్థాయిలో పని చేశారు. 

ఆ తర్వాత తెలుగులో నెంబర్ వన్‌ న్యూస్‌ ఛానల్‌ టీవీ9లో సబ్‌ఎడిటర్ నుంచి డెస్క్‌ ఇన్‌చార్జ్ వరకు సుమారు 16 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం పని చేశారు. ఆ సమయంలో టీవీ9 చేపట్టిన వివిధ ప్రయోగాల్లో భాగస్వామి అయ్యారు. పొలిటికల్‌, క్రైం,రూరల్‌, అర్బన్‌, వెదర్‌, సైన్స్ న్యూస్ కవర్‌ చేసే అవకాశాన్ని దక్కించుకుని, అందులో అపార అనుభవం సంపాదించారు. 

అనంతరం 99టీవీ, సీవీఆర్‌, భారత్‌ టుడే, స్వతంత్ర, ఐన్యూస్‌ వంటి ఛానళ్లకు అవుట్‌ ఎడిటర్‌గా సేవలు అందించారు. 

ఈ క్రమంలోనే ఫేక్‌న్యూస్‌ అరికట్టడానికి తన టీమ్‌ మెంబర్స్‌కి ఎప్పటికప్పడు అవగాహన కల్పిస్తూ, తప్పుడు కథనాల కట్టడికి తన వంతు కృషి చేశారు. అంతేకాకుండా నీటిపారుదల, వ్యవసాయ రంగం, వలస కార్మికుల సమస్యలను ఎత్తిచూపుతూ వివిధ కథనాలు ప్రచురితం చేసి, అటు ప్రభుత్వం, ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం చూపగలిగారు. 

2006 సునామీ సమయంలో డిజాస్టర్ రెస్పాన్స్‌ టీమ్ లతో  కలిసి, వరద బాధితులకు అత్యవసరాలు అందించడంతోపాటు వరదలు, తుఫాన్‌ వార్తలను కవర్‌ చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. 

వరదల నష్టాలు, తుఫాన్‌ బాధితుల ధీనస్థితి, విపత్తు గురించి విస్రృత కథనాలను ప్రత్యేకంగా న్యూస్‌ బులెటిన్లు ఏర్పాటు చేసి, ప్రసారం అయ్యేలా చేశారు.  

వాతావరణ వార్తల సేకరణపై మక్కువతో ఇప్పటికీ తన సోషల్‌మీడియా అకౌంట్లల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్లు పెడుతున్నారు. 

తెలుగు మీడియాపై తనదైన ముద్ర వేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ వాకిటి వెంకటేశం ముదిరాజ్ ని అమెరికా ప్రభుత్వం గుర్తించి, వెదర్ ప్రాజెక్టులో భాగస్వామి చేయడం, ఒక తెలంగాణ జర్నలిస్ట్‌కు దక్కిన అరుదైన గౌరవం.

 

Courtesy : Bhuvision news

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :