MKOne TeluguTimes-Youtube-Channel

2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం

2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం

2025లో చైనాతో యుద్ధం తప్పకపోవచ్చని అమెరికా ఎయిర్ మొబిలిటీ కమాండ్ చీఫ్ జనరల్ మైక్ మినహాన్ అంచనా వేశారు. 2024లో అమెరికాతో పాటు తైవాన్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, ఆ అవకాశంగా తీసుకొని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్పై దాడికి పాల్పడవచ్చన్నారు. అందుకే ఏఎంసి సిబ్బంది గురి తప్పకుండా కాల్పులు జరిపేలా కథోర శిక్షణకు సిద్ధం కావాలని, రికార్డులను అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. చైనాపై పోరాడి గెలిచేందుకు సమీకృత, పటిష్ఠ బృందాలను సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఎయిర్ మొబిలిటీ కమాండ్(ఏఎంసీ) కింద 50 వేల మంది ఆర్మీ సిబ్బంది, 500 విమానాలు ఉన్నాయి. రవాణా, ఇంధన అవసరాలు తీర్చడం ఈ విభాగం ప్రధాన బాధ్యతలు, తైవాన్లో చైనాలో అంతర్భాగం, ఎప్పటికైనా కలిపేసుకుంటామంటూ డ్రాగన్ దేశం చెబుతోంది. ఈ అంశంపై చైనా, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రికత్తలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

 

Tags :