అమెజాన్ కీలక నిర్ణయం... ప్రైమ్ డే సేల్ ను

అమెజాన్ కీలక నిర్ణయం... ప్రైమ్ డే సేల్ ను

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్‍ ఇటీవలే ప్రైమ్‍ డే సేల్‍ పేరిట ఒక భారీ సేల్‍ను ప్రకటించింది. ప్రతి ఏడాది నిర్వహించే సేల్‍లో భాగంగా ఈసారి కూడా అమెరిజాన్‍ ఎలక్ట్రానిక్‍, ఇతర వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‍టాప్‍లు వంటి వాటిపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. అయితే దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‍లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రైమ్‍ డే సేల్‍ను వాయిదా వేస్తున్నట్లు అమెజాన్‍ ఇండియా తెలియజేసింది. గత ఏడాది సైతం కరోనా కారణంగా ఈ సేల్‍ను అమెజాన్‍ ఆగస్టులో నెలలో నిర్వహించింది. కరోనా వ్యాప్తి, పలు చోట్ల లాక్‍డౌన్‍ల నేపథ్యంలో డెలివరీలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతోనే అమెజాన్‍ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Tags :