అల్లు అర్జున్ థియేటర్లో మొదటి సినిమా అదే..

ఫామ్ లో ఉన్న ప్రతీ నటీనటులు ఇప్పుడు సినిమాలు చేస్తూనే మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్స్, బిజినెస్ లు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏఎంబీ మాల్ ను రన్ చేస్తుండగా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ఏవీడీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ ను స్టార్ చేశాడు.
ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. అమీర్‌పేటలో బన్నీ కొత్తగా ఓ మల్టీప్లెక్స్ ను నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి ఏఏఏ సినిమాస్ అనే పేరును కూడా పెట్టారు. అంటే ఏషియన్ అల్లుఅర్జున్ అని అర్థమన్నమాట. పూర్వం ఈ మల్టీప్లెక్స్ ఉన్న స్థలంలో సత్యం థియేటర్ ఉండేది. ఆ థియేటర్ ను అల్లు అర్జున్ తీసుకుని దాన్ని ఇలా మల్లీప్లెక్స్ గా మార్చాడు.
ఇప్పుడు ఆ మల్టీప్లెక్స్ లో రాబోయే మొదటిసినిమాను డిసైడ్ చేశారు. జూన్ 16న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తో ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ కాబోతుందని సమాచారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే ఈ మల్టీప్లెక్స్ ను ఓపెన్ చేయించాలని చూస్తున్నాడట ఐకాన్ స్టార్. అంటే మరో రెండు వారాల్లో అమీర్‌పేటలో కొత్త మల్టీప్లెక్స్ రానుందన్నమాట.






