మై హోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్

మై హోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మై హోమ్‌ గ్రూప్‌ (హైదరాబాద్‌ కు చెందిన) మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.  గోపనపల్లి-తెల్లాపూర్‌ రోడ్‌లో మై హోమ్‌ సయూక్‌ ను ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై హోమ్‌ సంస్థ చేపట్టే ప్రాజెక్టులు ఎంతో నాణ్యతతో ప్రతిష్టాత్మకంగా ఉంటాయన్నారు. మాదాపూర్‌లోని మై హోమ్‌ సంస్థ ప్రాజెక్టులో తాను కూడా ఒక ఫ్లాటు తీసుకున్నట్లు తెలిపారు.

తర్వాత మై హోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామేశ్వర్‌ రావు మాట్లాడుతూ సౌకర్యవంతమైన జీవనం, అంతే సౌకర్యంవతంగా ఉండే ప్రాంతాలలో, కమ్యూనిటీలకు అతి చేరువగా ఉండేలా హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత మూడు దశాద్దాలకు పైగా ఈ తరహా ప్రాజెక్టులనే అభివృద్ధి చేస్తూ అగ్రగామిగా సంస్థగా మై హోమ్‌ వెలుగొందుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మై హోమ్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ జే రాము రావ్‌, ప్రతిమ గ్రూప్‌ చైర్మన్‌ బీ శ్రీనివాస్‌ రావ్‌, మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎండీ జే శ్యామ్‌ రావ్‌, డైరెక్టర్‌ (మార్కెటింగ్‌) జే రాజిత రావ్‌ పాల్గొన్నారు.

 

Tags :