ASBL NSL Infratech

“అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు” మార్చ్ 9-10, 2024 - వీడియో ఆహ్వానం

“అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు” మార్చ్ 9-10, 2024 - వీడియో ఆహ్వానం

మిత్రులారా,

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 30 వ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయిలో “అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు” మార్చ్ 9-10, 2024 తేదీలలో కాకినాడ మహా నగరం (ఆంధ్ర ప్రదేశ్) లో జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఈ  ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు భారత దేశ పూర్వ ఉప రాష్ట్రపతి గౌ. వెంకయ్య నాయుడు గారు ప్రధాన అతిధిగా, సుమారు 60 మంది లబ్దప్రతిష్టులు అయిన తెలుగు రచయితలు, సాహితీవేత్తలు ఈ సదస్సులో తమ సాహిత్య ప్రసంగాలతో సభాసదులను అలరించనున్నారు.

ఈ సదస్సు ఆశయాలను వివరిస్తూ, ఆసక్తి ఉన్న వక్తలు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, రచయితలు, పండితులు, విశ్లేషకులు, భాష, సాహిత్యాభిమానులకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ రూపొందించిన వీడియో ప్రకటన ఈ క్రింది లంకె లో చూడవచ్చును. 

ఈ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో పాల్గొని తెలుగు భాషా, సాహిత్యాలని ఆస్వాదించండి. ఆనందించండి. ఆదరించండి.

పూర్తి వివరాలకు జత పరిచిన సమగ్ర ప్రకటన చూడండి. స్పందించండి.

 

భవదీయులు,

అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు, ఎర్రాప్రగడ రామకృష్ణ, చిరంజీవినీ కుమారి, వక్కలంక రామకృష్ణ, యనమండ్ర సూర్యనారాయణ మూర్తి,
కొరుప్రోలు గౌరి నాయుడు, డా. కాళ్ళకూరి శైలజ, మార్ని జానకి రామ చౌదరి, రాధిక మంగిపూడి, సుచిత్ర బాలాంత్రపు, 
మునమర్తి కృష్ణవేణి, అవధానుల మణిబాబు, జోస్యుల కృష్ణబాబు, కె. వి ఎస్. ఆర్. ప్రకాష్

సలహాదారులు: వంశీ రామరాజు (Managing Trustee, Vanguri Foundation of America, Hyderabad), 
శాయి రాచకొండ (గౌరవ సంపాదకులు, హ్యూస్టన్, టెక్సస్), లక్ష్మి రాయవరపు (తెలుగు తల్లి, ప్రధాన సంపాదకులు, టొరంటో, కెనడా)

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :