రెండేళ్ల వరకు ఆలియా బిజీ
ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా ఒక హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆలియా మళ్లీ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ సరసన నటించే ఛాన్సుందని వార్తలొచ్చాయి. బుచ్చి బాబు- రామ్ చరణ్ కలయికలో తెరకెక్కనున్న సినిమాలో ఆలియాని ఫిక్స్ చేశారని కూడా ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ ఇవేవీ నిజాలు కావని తేలిపోయింది.
నెక్ట్స్ ఇయర్ వరకు ఆలియా భట్స్ కాల్షీట్లు ఖాళీగా లేవని తెలుస్తోంది. రణబీర్ కపూర్- విక్కీ కౌశల్ తో కలిసి ఆలియా భట్ లవ్ అండ్ వార్ అనే సినిమా కోసం నెక్ట్స్ ఇయర్ క్రిస్మస్ వరకు డేట్స్ ను బ్లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో అనౌన్స్ చేశారు.
ఈ సినిమా కోసం అభిమానులతో పాటూ రణబీర్ కపూర్, ఆలియా భట్ తో సహా మిగిలిన వాళ్లంతా కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విక్కీ కౌశల్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ఇందులో నటించనుండటంతో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా ఎక్కువైంది. ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటులంతా 100% ఎఫెర్ట్ పెట్టడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో శాశ్వతమైన ముద్ర వేయడానికి సంజయ్ లీలా భన్సాలీ మునుపెన్నడూ లేని కొత్త అంశాన్ని చూపించబోతున్నట్లు సమాచారం.