ASBL NSL Infratech

సినిమాలు ప్లాప్ అయినా త‌గ్గేదేలే!

సినిమాలు ప్లాప్ అయినా త‌గ్గేదేలే!

ఎవ‌రికైనా ఒక డిజాస్ట‌ర్ వ‌స్తే కోట్ల రెమ్యూన‌రేష‌న్ ను వ‌దులుకుని ఏళ్ల త‌రబ‌డి గ్యాప్ తీసుకున్న వాళ్లు అన్ని భాష‌ల్లో ఉంటారు. కానీ అక్ష‌య్ కుమార్ మాత్రం త‌న రూటే స‌ప‌రేటంటున్నాడు. తను న‌టించిన భారీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా మారుతున్నా, నిర్మాత‌ల‌కు కోట్లలో న‌ష్టం వ‌స్తున్నా స‌రే త‌గ్గేదేలే అంటున్నాడు.

త‌న నుంచి సంవ‌త్స‌రానికి నాలుగైదు సినిమాలు ఉండేలా మూడేళ్ల‌కు స‌రిప‌డా ప్లాన్ చేసుకున్నాడు అక్ష‌య్ కుమార్. రీసెంట్ గా రిలీజైన బ‌డేమియా చోటేమియా సినిమా ఘోర‌మైన ప‌రాజ‌యాన్ని అందుకుంది. రూ.350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.50 కోట్ల నెట్ క‌లెక్ట్ చేసేందుకే నానా తంటాలు పడుతోంది.

టికెట్ల‌కు ఎన్ని ఆఫ‌ర్లిచ్చినా ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు వెళ్లేలా క‌నిపించ‌డం లేదు. అక్ష‌య్ కుమార్ తీస్తున్న సినిమాలు ఫ్లాపవుతున్నా స‌రే నిర్మాత‌లు మాత్రం ఆయ‌న‌తో సినిమాలు తీయ‌డం మాన‌డం లేదు. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ ఓకే చేసిన సినిమాలు ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 14 వ‌ర‌కు ఉన్నాయి. త‌న సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన సినిమాలు చేయ‌డం త‌గ్గించ‌న‌ని చెప్తున్న ఈ సీనియ‌ర్ హీరో ఇంత వ‌య‌సులో ఏ మాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ల‌డం గొప్ప విష‌య‌మే.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :