ASBL NSL Infratech

అఖిల్ మూవీ అప్డేట్ ఆ రోజేనా?

అఖిల్ మూవీ అప్డేట్ ఆ రోజేనా?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ త‌ప్పించి మిగిలిన ఏ సినిమా కూడా అఖిల్ కు బాక్స‌ఫీస్ ప‌రంగా మంచి రిజ‌ల్ట్ ను ఇవ్వ‌లేదు. గ‌తేడాది భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఏజెంట్ డిజాస్ట‌ర్ అవ‌డంతో అఖిల్ చాలా డిజ‌ప్పాయింట్ అయ్యాడు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ త‌న ఖాతాలో సాలిడ్ హిట్ లేదు.

త‌నను తాను ప్రూవ్ చేసుకోవాల‌ని ఎంత ట్రై చేస్తున్నా స‌రే అఖిల్ కు స‌రిపోయే క‌థ అందుకోవ‌డంలో మాత్రం త‌ను ఫెయిల్ అవుతున్నాడు. ఏజెంట్ త‌ర్వాత అఖిల్ ఎలాంటి సినిమా చేస్తాడ‌ని ఫ్యాన్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తుంటే ఇప్ప‌టివ‌ర‌కు అఖిల్ త‌న నెక్ట్స్ మూవీ ఏంట‌న్న‌ది మాత్రం క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు.

హోంబ‌లే ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో అఖిల్ సినిమా ఉంటుంద‌ని, ఈ సినిమాకు సంబంధించిన డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. కానీ ఆ మూవీ గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. అఖిల్ త‌ర్వాతి సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. అఖిల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏప్రిల్ 8న అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంట‌నేది ప్ర‌క‌ట‌న వచ్చే ఛాన్సున్న‌ట్లు తెలుస్తోంది. అఖిల్ ఈసారి పీరియాడిక‌ల్ డ్రామాతో ఆడియ‌న్స్ ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈసారైనా అఖిల్ త‌న క‌ష్టానికి త‌గ్గ‌ మంచి ఫ‌లితాన్ని అందుకుంటాడేమో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :