ASBL Koncept Ambience
facebook whatsapp X

గ్యాప్ ను క‌వ‌ర్ చేయ‌నున్న అఖిల్

గ్యాప్ ను క‌వ‌ర్ చేయ‌నున్న అఖిల్

ఏజెంట్ సినిమా వ‌చ్చి ఏడాది దాటుతున్నా అఖిల్ త‌న త‌ర్వాతి సినిమాను ఇంకా మొద‌లుపెట్టలేదు. ఏజెంట్ డిజాస్ట‌ర్ వ‌ల్ల కొన్నాళ్ల వ‌ర‌కు బ‌య‌టే క‌నిపించ‌ని అఖిల్, ఇప్పుడు త‌న త‌ర్వాతి సినిమా కోసం మేకోవ‌ర్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అఖిల్ ఎక్క‌డా క‌నప‌డ‌ట్లేద‌ని టాక్. యువి క్రియేష‌న్స్ నిర్మించ‌నున్న సినిమా కోసం అఖిల్ బాగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాతో అనిల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. త్వ‌ర‌లోనే ఈ గ్రాండియర్ గా లాంచ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అఖిల్ ఈ ఒక్క సినిమాతో ఆగ‌ట్లేదు. దీంతో పాటూ మ‌రో రెండు సినిమాల‌కు కూడా అఖిల్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో మురిళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో ఒక సినిమా. చిత్తూరు బ్యాక్ డ్రాప్ క‌థ‌తో ముర‌ళీ కిషోర్ అఖిల్ తో పాటూ నాగ్ ను కూడా మెప్పించ‌డంతో సొంత బ్యాన‌ర్ లో ఆయ‌న దీన్ని నిర్మిస్తున్నాడు.  

ఇక రెండో సినిమా త‌న అన్న‌య్య‌కు ఏ మాయ చేశావే లాంటి హిట్ ఇచ్చిన గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో. ఎప్ప‌టినుంచో అఖిల్ గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని చూస్తున్నాడు. ఆయ‌న ద‌గ్గ‌ర అఖిల్ కోసం క‌థ‌ రెడీగా ఉంద‌ని స‌మాచారం. ఏజెంట్ త‌ర్వాత వ‌చ్చిన గ్యాప్ ను క‌వ‌ర్ చేసేలా అఖిల్ రాబోయే మూడేళ్లకు బిజీగా త‌న షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.  

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :