ASBL NSL Infratech

అయోధ్యలో అద్భుత దృశ్యం

అయోధ్యలో అద్భుత దృశ్యం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కన్పించిన సూర్య తిలకం తో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల  పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :