1960 తర్వాత ఇదే ప్రథమం... అయినా వారి డిమాండ్లు మాత్రం
మెరుగైన కాంట్రాక్టు షరతుల కోసం హాలీవుడ్‌లో రచయితలు, కళాకారులు చేస్తున్న సమ్మె 102 రోజులు పూర్తి చేసుకుంది. అయినా వారి డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదు. మే 2, హాలీవుడ్ స్క్రీన్ రైటర్స్, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నాయకత్వంలో మెరుగైన కాంట్రాక్ట్ షరతులను కోరుతూ సమ్మెను ప్రారంభించారు. పెద్ద స్టూడియోలు రచయితలకు మంచి వేతనాలు చెల్లించాలని, వారి ఉద్యోగాలకు హాని కలిగించేలా కత్రిమ మేధస్సును (ఎఐ)ని అతిగా ఉపయోగించకూడదని డిమాండ్ చేశారు. వార్నర్ బ్రదర్స్‌తో సహా పెద్ద స్టూడియోలు దీనిపై సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా లేవు. రచయితలకు, సంఫీుభావంగా నటీనటులు కూడా జులై 14 ఉంచి సమ్మెకు దిగడంతో హాలీవుడ్ స్తంభించింది. చిత్రీకరణ, రికార్డింగ్, పబ్లిసిటీ సహా ఏ కార్యక్రమంలోనూ ప్రముఖ తారలు పాల్గొనబోరని ప్రకటించారు. 1960 తర్వాత రెండు సంస్థలు కలిసి సమ్మెలో పాల్గొనడం ఇదే ప్రథమం.