ASBL NSL Infratech

వివాదాలతో కెరీర్ లో స్లో అయిన యాక్టర్స్ ..!

వివాదాలతో కెరీర్ లో స్లో అయిన యాక్టర్స్ ..!

టాలీవుడ్ లో టాలెంట్ తో పాటు కాస్త లక్ ఉంటేనే రాణించగలరు అని అంత అంటుంటారు. ఈ రెండు ఉండగానే సరిపోదు కెరీర్ ని సరైన దారిలో తీసుకెళ్లడానికి సమర్ధత, ప్లానింగ్ కూడా ఉండాలి అని కొంత మంది స్టార్స్, సక్టర్స్ జీవితాలని చుస్తే అర్ధమవుతుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కొన్ని వివాదాల్లో ఇరుక్కొని తమ సినిమా కెరీర్ లో స్లో అయిన కొందరి స్టార్స్ గురించి తెలుసుకుందాం.

హీరో సుమన్ ఒకప్పుడు తెలుగు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరో. మెగాస్టార్ చిరంజీవికి సైతం ఒకానొక సమయంలో పోటీ ఇచ్చిన స్టార్ హీరో సుమన్. స్వతహాగా కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన హీరో సుమన్ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అయితే తన సినీ జీవితం మంచి ఫామ్ లో ఉన్న టైం లో అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకుని  జైలుకి వెళ్లారు. ఆ తర్వాత బయటికి వచ్చినప్పటికీ అనుకున్నన్ని అవకాశాలు రాకపోవడంతో వెనక పడ్డాడు.

ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అందరి చూపుని తన వైపుకి తిప్పుకున్న ఆర్టిస్ట్ పృథ్వి. వరుసగా తను కామెడీ పండించిన సినిమాలు హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీటీడీ లో ఒక ఉన్నత పదవిని అధిరోహించారు. ఈ తరుణంలో ఒక అమ్మాయితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీక్ అవ్వడంతో ఇరుకున పడ్డారు. అప్పటినుండి ఈ నటుడికి సినిమా అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.

చిత్రం శీను మొదటి సినిమా "చిత్రం" తో వెండితెరకు పరిచయమైన ఈ ఆర్టిస్ట్ ఈ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. ఎంతో మంది హీరోలకి ఫ్రెండ్ గా నటించి మంచి పేరుని సొంతం చేసుకున్నాడు చిత్రం శీను. అయితే ఇతడు కూడా ఒక వివాదం లో ఇరుక్కుని కెరీర్ పీక్ టైం లో చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పాలి. మొదటి భార్య ఉండగానే ఆవిడకి విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేకున్నాడంటూ అప్పట్లో ఈ నటుడిపై చాలా గొడవలే జరిగాయి. ప్రస్తుతం అవి సద్దుమణిగినప్పటికీ సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోయాయి. కొంతకాలం తర్వాత బుల్లితెరపై కామెడీ షోస్ లో కనిపించినప్పటికీ అంతగా రాణించలేకపోయాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :