కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి

సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచుకున్నారు. ఆమెకు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని అన్నారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. ఇటీవల విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ తీరుపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు.







Tags :