బాబూ మోహన్ కు తనయుడి షాక్

అందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బాబు మోహన్ కొడుకు ఉదయ్ బాబు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన తో పాటు జోగి పేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ బిజెపీ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకూర మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాలను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.







Tags :