ASBL NSL Infratech

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్

ఢిల్లీ మద్యం పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు వరుసగా అరెస్టవుతున్న తరుణంలో ఆ పార్టీకి కాస్త ఊరట కలిగింది. ఈ వ్యవహారంలో ఆరు నెలల క్రితం అరెస్టయిన ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ట్రయల్‌ కోర్టు విధించిన షరతులకు లోబడి నడుచుకోవాలని ఆయన్ని ఆదేశించింది. మరోవైపు రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనేందుకు అనుమతిచ్చింది.  లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో జైలు నుంచి ఆయన విడుదలవడం పార్టీకి కాస్త సాంత్వన చేకూర్చే అంశమే.  ఈ కేసులో అఫ్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్‌ అరోడాతో సంజయ్‌సింగ్‌కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు, సంజయ్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి, అక్టోబర్‌ 4న ఆయన్ని అరెస్టు చేశారు. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం తిహాడ్‌ జైలుకు తరలించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :