ASBL NSL Infratech

59వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

59వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

అమెరికాలో గత ఏడాది 8.7 లక్షల మంది విదేశీయులకు ఆ దేశ పౌరసత్వం లభించగా అందులో భారతీయులు 6.7 శాతం మంది ఉన్నారు. మొత్తం 59,100 మంది భారతీయులకు బైడెన్‌ ప్రభుత్వం అమెరికా పౌరసత్వాన్ని ఇచ్చింది. అమెరికా పౌరసత్వం పొందిన వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 1.10 లక్షల మంది (12.7 శాతం)తో మెక్సికన్లు మొదటి స్థానాన్ని పొందారు. 2022తో పోల్చితే ఈ సంఖ్య కొంత తక్కువగానే ఉంది. ఆ ఏడాది మొత్తం 6.69 లక్షల మంది విదేశీయులకు అమెరికా పౌరసత్వం లభించగా అందులో భారతీయుల వాటా 6.8 శాతం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :