సలార్ ప్లేస్ లో 25 సినిమాలు

వినాయక చవితికి, దసరాకు మధ్యలో బాక్సాఫీస్ ను షేక్ చేసే డేట్ గా సెప్టెంబర్ 28ని అనుకున్నారంతా. ఆ రోజున సలార్ రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేయగానే మంచి డేట్ అని అందరూ ఫీలయ్యారు. సలార్ తో పాటూ వ్యాక్సిన వార్ తప్ప మరో సినిమా లేకపోవడంతో లైన్ క్లియర్ అనుకున్నారు.
గురువారం మొదలు, సోమవారం గాంధీ జయంతి వరకు 5 రోజులు సలార్ సినిమా కలెక్షన్ల వర్షం కురింపిచడం ఖాయం అనుకున్నారు కానీ ఉన్నట్లుండి సినిమా పోస్ట్ పోన్ అవడంతో టాలీవుడ్ తో పాటూ మిగిలిన భాషల్లోని మూవీ రిలీజ్ డేట్ల విషయంలో మార్పులొచ్చాయి. సలార్ పోస్ట్ పోన్ కాకపోతే దానితో వ్యాక్సిన వార్ తప్ప మరో సినిమా రిలీజయ్యేది కాదు. పోటీ లేకుండా ఉండేది.
కానీ సలార్ పోస్ట్ పోన్ అవడంతో ఆ వారం ఒకటి కాదు రెండు కాదు 25 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. తెలుగులో సలార్ ప్లేస్ లో స్కంద, పెదకాపు1, చంద్రముఖి2, వ్యాక్సిన్ వార్ సినిమాలు రిలీజ్ అవుతుండగా, హిందీలో వ్యాక్సిన్ వార్ తో పాటు ఫక్రీ2, ప్యార్ హై తో పాటూ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మిగిలిన భాషల్లో కూడా పలు సినిమాలు ఈ నెల 28న రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఒక్క సలార్ సినిమా పోస్ట్ పోన్ అయితే ఆ ప్లేస్ లో 25 సినిమాలు రిలీజ్ అవుతుండటం చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.






