ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికాలో భారీ కుంభకోణం..ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు జైలు

అమెరికాలో భారీ కుంభకోణం..ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు జైలు

అమెరికా హెల్త్‌ కేర్‌ రంగంలో ప్రకటనలకు సంబంధించిన వ్యవహారంలో వేలకోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్న నేరంపై ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులతో సహా ముగ్గురికి ఫెడరల్‌ కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. చికాగో కేంద్రంగా పనిచేస్తున్న హెల్త్‌ టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీ ఔట్‌కమ్‌ హెల్త్‌ సంస్థలో కీలక స్థానాల్లో పనిచేసిన రిషి షా, శ్రద్దా అగర్వాల్‌ కుట్రపూరితంగా మోసాలకు పాల్పడ్డారని, తమ క్లయింట్లను, వైద్యులను సొంత ఆడిటర్లను చివరకు రోగులను మోసగించారని కోర్టు అభిప్రాయపడింది. వారు నిర్వహించిన సంస్థను నమ్మి ప్రకటనలు ఇచ్చిన ప్రముఖ కంపెనీలు, పెట్టుబడులు పెట్టిన వాణిజ్యవేత్తలు పెద్దఎత్తున మోసపోయినట్లు విచారణలో తేలడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. 

ఔట్‌కమ్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రిషి షాకు ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ ఫెడర్‌ కోర్టు తీర్పునిచ్చినట్టు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టి (జీఓజే)  ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఔట్‌కమ్‌ సంస్థ మాజీ సహ వ్యవస్థాపకురాలు, మాజీ అధ్యక్షురాలు శ్రద్ద అగర్వాల్‌కు 3 ఏళ్ల హాఫ్‌ వే హౌస్‌ విధించినట్లు పేర్కొంది. రిషి షా, శ్రద్ధా అగర్వాల్‌ భారతీయ సంతతికి చెందినవారు. ఇదే కుంభ కోణంలో నిందితురాలు ఔట్‌కమ్‌ సంస్థ మాజీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, చీఫ్‌ పైనాన్షియల్‌ ఆఫీసర్‌ బ్రాడ్‌ పుర్డీకి రెండేళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు  పేర్కొన్నారు. వీరి తన క్లయింట్లను, ఆడిటర్లను, పెట్టుబడిదారులను, తమ సేవలను  పొందినవారిని ఏళ్ల తరబడి మోసగిస్తూ వచ్చారని ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ నికోల్‌ ఎం అర్జెంటీరీ తెలిపారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :