MKOne Telugu Times Youtube Channel

విపక్షాలు సంయుక్త ప్రకటన.. మేం రావట్లేదు

విపక్షాలు సంయుక్త  ప్రకటన.. మేం రావట్లేదు

పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పార్లమెంట్‌ కొత్త భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ తీరు రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రదాని మోదీకి కొత్తేం కాదు. పార్లమెంట్‌లో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. వారి మాలను మ్యూట్‌ చేశారు. పార్లమెంట్‌ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టినప్పుడు ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు అని విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

 

 

Tags :