ASBL NSL Infratech

ఆటా 2వరోజు మహాసభలకు మంచి స్పందన

ఆటా 2వరోజు మహాసభలకు మంచి స్పందన

అమెరికాలో అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలు అట్లాంటాలోని జార్జియా వరల్జ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జూన్‌ 7న ప్రారంభమైన ఆటా వేడుకలు రెండవరోజు కూడా ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు.

ఆటా నాయకుల ప్రసంగాలు, స్వాగత నృత్యం, డోనర్ల సత్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు,, జుమ్మందిపాదం, సయ్యందిపాదం విజేతలకు బహుమతుల ప్రదానం, రోబో గణేశన్‌ ఆధ్వర్యంలో రోబోటిక్‌ డ్యాన్స్‌, జబర్డస్త్‌ టీమ్‌ వారి హాస్య నాటిక, రాజకీయ నాయకులకు సన్మానాలు, ప్రసంగాలు, ఆటల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం, ఇతర పోటీల విజేతలకు కూడా అవార్డులు, పొలిటికల్‌ సెమినార్‌, బిజినెస్‌ సెమినార్‌, తదితర కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందాల తార శ్రీదేవికి నివాళులు అర్పిస్తూ చేసిన నృత్య కార్యక్రమం కూడా ఆకర్షణీయంగా నిలిచింది. దాజీతో హార్ట్‌ఫుల్‌నెస్‌ ప్రసంగం, మెడిటేషన్‌ కార్యక్రమాలు, యుఎస్‌ పొలిటికల్‌ ఫోరం చర్చలు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ప్రదర్శన, టిడిఎఫ్‌ సెషన్‌, యూత్‌ ఫోరం కార్యక్రమాలు కూడా ఈ రెండవరోజున జరిగాయి. చివరన జరిగిన థీయరీ బ్యాండ్‌ సంగీత విభావరి అందరినీ పరవశులను చేసింది.

ఆటా ప్రెసిడెంట్‌ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జయంత్‌ చల్లా, కన్వీనర్‌ కిరణ్‌ పాశంతోపాటు ఆటా ప్రముఖులు, ఇసి సభ్యులు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :