ASBL NSL Infratech

ముగిసిన ఆటా మహాసభలు

ముగిసిన ఆటా మహాసభలు

అమెరికాలో అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలు అట్లాంటాలోని జార్జియా వరల్జ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జూన్‌ 7 నుంచి 9వ తేదీ వరకు జరిగిన ఈ మహాసభల్లో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. చివరిరోజున  భద్రాచల దేవస్థానం వారి శ్రీ సీతారాముల కల్యాణం భక్తి పారవశ్యంలో ముంచింది.. భద్రాచల పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం పూర్తి చేశారు. సాహితీ సదస్సులు, ఉమెన్స్‌ ఫోరమ్‌, కంటిన్యూఇంగ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, బిజినెస్‌ ఫోరమ్‌, యూత్‌ ఇన్నోవేషన్స్‌, స్పిరిచువల్‌ ఫోరమ్‌, దాజి హెర్ట్ఫుల్నెస్‌ సెషన్స్‌, పొలిటికల్‌ ఫోరమ్‌ వంటి కార్యక్రమాలు వివిధ బ్రేకవుట్‌ రూమ్స్‌లో నిర్వహించారు. ఉమెన్స్‌ ఫోరమ్‌ లో సినీ హీరోస్‌ విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ పాల్గొని ఆశ్చర్యపరిచారు. మెయిన్‌ స్టేజీపై పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  

టాలీవుడ్‌ నటి నేహా శెట్టి, సినీ హీరోస్‌ విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ తదితరులను సన్మానించారు. ఆటా కార్యనిర్వాహక సభ్యులను, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ని, వివిధ కమిటీల ఛైర్స్‌, కో-ఛైర్స్‌ తదితరులను వేదికమీదకు పిలిచి అభినందించారు. టాలీవుడ్‌ డాన్స్‌ మాస్టర్‌ సత్య, నటీమణులు సౌమ్య, అంకిత, సరయు కలిసి వేసిన డాన్స్‌ ప్రోగ్రాంకి మంచి స్పందన వచ్చింది. తానా, నాట్స్‌, నాటా, టిటిఏ, టీడీఎఫ్‌, జిటిఏ, ఎన్నారై వాసవి వంటి జాతీయ సంస్థల ప్రతినిధులను ఆటా నాయకత్వం వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు.

ముఖ్య అతిథులు విజయ్‌ దేవరకొండ, నేహా శెట్టి, ఆనంద్‌ దేవరకొండ చేతుల మీదుగా బ్యూటీ పాజెంట్‌ విజేతలకు, రన్నరప్స్‌ కి క్రౌన్స్‌ అందించారు. ఆటా లైఫ్‌ టైం అచీవ్మెంట్‌ అవార్డుని దాజి తరపున ప్రతినిధికి అందజేశారు. అలాగే ఆటా జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. ఇండియా నుంచి విచ్చేసిన పరంపర ఫౌండేషన్‌ వారు ప్రదర్శించిన గుడి సంబరాలు నృత్యానికి సభికులందరూ నుంచొని మరీ కరతాళధ్వనులతో అభినందించారు. .ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని మరియు కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ కిరణ్‌ పాశం తమ సందేశం వినిపించారు. చివరిగా టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ తమన్‌  ట్రూప్‌ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :