షూటింగ్ స్పాట్‌లో జరిగిన ఆసక్తికర సంఘటన

17th February 2026

White Scribbled Underline

ర‌జినీకాంత్ న‌టించిన క‌బాలి మూవీలో ర‌జినీ కూతురిగా న‌టించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది న‌టి సాయి ధన్సిక‌.

ధ‌న్సిక త‌మిళంతో పాటూ మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, తెలుగు సినిమాల్లో న‌టించి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.

రీసెంట్ గా యోగి డా మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ధ‌న్సిక త‌న లైఫ్ లో జ‌రిగిన షాకింగ్ విష‌యాన్ని షేర్ చేసుకుంది.

ధ‌న్సిక షూటింగ్ లో ఉన్న‌ప్పుడు ఓ వ్య‌క్తి మందు తాగి త‌న అంకుల్ వ‌ద్ద‌కు వ‌చ్చి కొట్టి పారిపోవ‌డానికి ట్రై చేశాడ‌ట‌. ఆ సీన్ చూసిన వెంట‌నే ధ‌న్సిక కోపోద్రోక్తురాలైంది.

వెంట‌నే అత‌డిని వెంబ‌డించి ప‌ట్టుకుని చిత‌క‌బాదింద‌ట ధ‌న్సిక. మార్ష‌ల్ ఆర్ట్స్ లో ఎక్స్‌పీరియెన్స్ ఉండ‌టంతో అత‌నిపై ఇష్ట‌మొచ్చిన‌ట్టు దాడి చేసింద‌ట.

Rajinikanth నటించిన Kabali సినిమాలో కూతురు పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న Sai Dhanshika అప్పటినుంచి యాక్షన్ ఇమేజ్ సంపాదించుకుంది.

మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్న ధన్సిక షూటింగ్‌ల్లో కూడా ఎంతో డిసిప్లిన్‌గా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతుంటారు.

ఈ సంఘటన తర్వాత సెట్‌లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేసినట్టు సమాచారం

తనకు, తన కుటుంబానికి ఎవరు హాని చేయాలనుకున్నా తాను వెనక్కి తగ్గనని ధన్సిక స్పష్టం చేసింది.