24 క్యారెట్ల బంగారం పూర్తిగా స్వచ్ఛమైనది అని అందరికీ తెలిసిందే. ఇందులో ఇతర లోహాలు కలపరు కాబట్టి ఇది 99.9 శాతం శుద్ధంగా ఉంటుంది.
అయితే ఈ బంగారం చాలా మృదువుగా ఉంటుంది. సులభంగా వంగిపోవడం, గీతలు పడటం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
జ్యువెలరీ తయారీలో బంగారం బలంగా ఉండాలి. అందుకే 22 క్యారెట్లు లేదా 18 క్యారెట్ల బంగారంలో వెండి, రాగి వంటి లోహాలు కలుపుతారు.
ఇలా మిశ్రమం చేయడం వల్ల ఆభరణాలు గట్టిగా, ఎక్కువ కాలం నిలబడేలా ఉంటాయి. డిజైన్లు కూడా స్పష్టంగా రావడానికి ఇది సహాయపడుతుంది.
24K బంగారం సాధారణంగా బిస్కెట్లు, నాణేలు రూపంలో పెట్టుబడుల కోసం ఉపయోగిస్తారు. ధర ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం.
అందుకే పూర్తిగా ప్యూర్ అయినా, రోజూ ధరించే ఆభరణాల కోసం 24 క్యారెట్ల బంగారం కంటే తక్కువ క్యారెట్ల బంగారాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు