2026 తొలి చంద్రగ్రహణ ప్రభావం..రాశుల వారీగా ఫలితాలు, పరిహార సూచనలు

2nd March 2026

White Scribbled Underline

2026 సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడనుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఇది సంవత్సరాంతంలోని ముఖ్య గ్రహణంగా భావిస్తున్నారు.

మనదేశంలో ఇది పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. సాయంత్రం 6:15 నుంచి 6:45 వరకు గ్రహణ ప్రభావం ఉంటుంది.

సింహ రాశిలోని పుబ్బ నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తోంది. అందువల్ల ఆ రాశి వారికి జాగ్రత్త అవసరమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

మిథున, తులా, వృశ్చిక, మీన రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి కావడం, ధనలాభం, కెరీర్ అవకాశాలు లభిస్తాయి

మేష, కర్కాటక, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారు ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 

వృషభ, మకర రాశుల వారికి ఫలితాలు సాధారణంగా ఉంటాయి.

గ్రహణ దోషం ఉన్నవారు ధాన్య దానం చేయడం మంచిదని చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఇష్టదైవ మంత్రజపం చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు.