గుండెపోటు ఒక్కసారిగా వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో దానికి కొన్ని గంటల ముందు శరీరం సంకేతాలు ఇస్తుంది.
గుండె ప్రాంతంలో ఒత్తిడి లేదా బరువుగా అనిపించడం ప్రధాన లక్షణం. ఛాతీలో మంట, నొప్పి, అసౌకర్యం మూడు గంటల ముందు నుంచే కనిపించవచ్చు.
ఎడమ చేయి, భుజం, మెడ, దవడ వరకు నొప్పి వ్యాపించడం మరో హెచ్చరిక. ఈ నొప్పి తక్కువగా మొదలై క్రమంగా పెరగవచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసహజమైన చెమటలు, ఆకస్మిక అలసట కూడా గమనించాలి. ఏ పని చేయకపోయినా బలహీనంగా అనిపించడం ప్రమాద సూచన.
వాంతులు, తల తిరగడం, గ్యాస్ సమస్యలా అనిపించడం కూడా కొన్నిసార్లు గుండెపోటు లక్షణాలే. ముఖ్యంగా మహిళల్లో గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కాకుండా ఇలా కనిపించవచ్చు.
ఇలాంటి సూచనలు కనిపించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. సమయానికి చికిత్స అందితే ప్రాణాపాయం తప్పించుకోవచ్చు.
ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం, తడబడుతున్నట్టుగా ఫీలవడం (palpitations) కూడా గుండె సమస్యకు సంకేతం కావచ్చు.
ముఖ్యంగా దీనికి తోడు ఛాతి నొప్పి లేదా శ్వాస ఇబ్బంది ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. దీనిని చాలా మంది సాధారణ టెన్షన్‌గా తీసుకుని నిర్లక్ష్యం చేస్తారు.