వేసవిలో చిల్ అవ్వడానికి బెస్ట్ వాటర్ పార్క్ స్పాట్ ఇదే! 

10th April 2026

White Scribbled Underline

వేసవిలో అరకు వెళ్తే చాపరాయి చూడకుండా రాకూడదు! కుటుంబంతో సరదాగా గడపడానికి ఇది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన వాటర్ పార్క్.

చాపరాయి - చిల్ అవుట్ స్పాట్

ఇది ఎత్తు నుంచి పడే జలపాతం కాదు, విశాలమైన బండరాళ్లపై పారే నీటి ప్రవాహం. అందుకే దీనిని 'క్యాస్కేడ్' అని పిలుస్తారు.

ఏముంది ఇక్కడ ప్రత్యేకం?

బండరాళ్లు నునుపుగా ఉండటం వల్ల నీటి ప్రవాహంతో పాటు జారడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఆస్వాదిస్తారు.

సహజ సిద్ధమైన స్లైడింగ్

లోతు తక్కువగా ఉండటం వల్ల పర్యాటకులు నీటిలో ధైర్యంగా నడవవచ్చు, కూర్చోవచ్చు. వేసవి ఎండలకు ఆ చల్లని నీరు ఎంతో హాయినిస్తుంది.

సురక్షితమైన జలవిహారం

చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు. పక్షుల కూతల మధ్య స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఇక్కడ గడపడం మీ ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది.

ఆహ్లాదకరమైన పరిసరాలు

చాపరాయి వద్ద వేడి వేడి బొంగులో చికెన్, కాల్చిన మొక్కజొన్న పొత్తులు దొరుకుతాయి. ఇక్కడ దొరికే లోకల్ స్నాక్స్ అస్సలు మిస్ అవ్వకండి.

నోరూరించే స్థానిక రుచులు

ప్రకృతి ఒడిలో అందమైన ఫోటోలు దిగడానికి ఇది బెస్ట్ ప్లేస్. ప్రవాహం మధ్యలో నిలబడి తీసే ఫోటోలు మీ ఇన్‌స్టాలో హైలైట్‌గా నిలుస్తాయి.

ఫోటోగ్రఫీ ప్రేమికులకు

రాళ్లు నాచు పట్టి జారే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా నడవండి. వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది, అందుకే ఉదయాన్నే వెళ్లడం మేలు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి