వేసవిలో చర్మానికి సహజ కాంతి ఇచ్చే సూపర్ ఫుడ్స్..

10th April 2026

White Scribbled Underline

వేసవిలో చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే సరైన ఆహారం చాలా ముఖ్యం. కొన్ని సూపర్ ఫుడ్స్ సహజంగా స్కిన్ గ్లోను పెంచడంలో సహాయపడతాయి.

పుచ్చకాయ వేసవిలో బెస్ట్ ఫ్రూట్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో నీరు ఎక్కువగా ఉండటంతో చర్మాన్ని హైడ్రేట్ చేసి గ్లోను పెంచుతుంది.

కీరదోస కూడా చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ స్కిన్‌ను తాజాగా ఉంచుతాయి.

నిమ్మకాయలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని శుభ్రపరచి నేచురల్ గ్లో అందిస్తుంది.

కొబ్బరి నీరు శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది. ఇది స్కిన్ టోన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

టమాటలో లైకోపీన్ ఉండటం వల్ల సన్ డ్యామేజ్ నుంచి రక్షణ లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బాదం ,వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ స్కిన్‌కు అవసరమైన మంచి ఫ్యాట్స్‌ను అందిస్తాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తాయి.

ఈ సూపర్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే వేసవిలో కూడా చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. సహజ ఆహారమే అందమైన చర్మానికి అసలైన రహస్యం.