మీ స్కిన్ గ్లో తగ్గించే ఆహారాలు ఇవే..

22nd April 2026

White Scribbled Underline

చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. కొన్ని ఫుడ్స్ మన స్కిన్ గ్లోను తగ్గించి సమస్యలు పెంచుతాయి. అందుకే వాటిని తగ్గించడం మంచిది.

ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల చర్మంలో ఆయిల్ పెరిగి మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి స్కిన్‌ను డల్‌గా కూడా మారుస్తాయి.

చక్కెర ఎక్కువగా ఉన్న స్వీట్స్ , కూల్‌డ్రింక్స్ చర్మంలోని కొలాజెన్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల వయసు ఎక్కువగా కనిపించేలా మారుతుంది.

ప్యాకెట్ ఫుడ్స్ ,ప్రాసెస్డ్ స్నాక్స్‌లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని డీహైడ్రేట్ చేసి మెరుపును తగ్గిస్తాయి.

ఎక్కువగా టీ, కాఫీ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీని ప్రభావం చర్మం డ్రైగా, డల్‌గా కనిపించడంలో ఉంటుంది.

మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం కొందరిలో స్కిన్ అలర్జీలు, మొటిమలు రావడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ఆల్కహాల్ ,సాఫ్ట్ డ్రింక్స్ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. దీని వల్ల స్కిన్ గ్లో తగ్గిపోతుంది మరియు ముడతలు త్వరగా వస్తాయి.

అతి ఉప్పు ఉన్న ఆహారం తీసుకుంటే ముఖం ఉబ్బడం, చర్మం నిస్సత్తువగా కనిపించడం జరుగుతుంది. ఇది స్కిన్ హెల్త్‌ను ప్రభావితం చేస్తుంది.

చివరగా, సరైన డైట్‌తో పాటు నీరు ఎక్కువగా తాగడం, తాజా పండ్లు తినడం వల్ల సహజమైన స్కిన్ గ్లో పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం అందమైన చర్మానికి రహస్యం.